టేకు దుంగల ( ఫైల్ ఫోటో…)
- సోమవారం 11 వేల రూపాయల కలప పట్టివేత
- గత నెల వ్యవధిలో లక్ష రూపాయల టేకు ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
- ఈ కలప ఎక్కడ తరలిస్తున్నట్లు…?
- ఎవరి హస్తం ఉన్నట్లు … ?
మహా వెలుగు , మంచిర్యాల ( భీమారo 12 ) : అక్రమ టేకు కలప రవాణా జోరుగా సాగుతుంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమ టేకు కలప స్మగ్లింగ్ అవుతుంది.

సోమవారం రాత్రి 11వేల టేకు కలప భీమారం మండల కేంద్రంలో అటవీశాఖ అధికారులు ముందస్తు సమాచారం మేరకు పట్టుకోగా స్మగ్లింగ్ చేసే వ్యక్తి పరారి లో ఉన్నట్లు ఎఫ్ఎస్ఓ రామకృష్ణ తెలిపారు.
గత నెల వ్యవధిలో లక్ష రూపాయల టేకు కలప అటవీ శాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. అయినా టేకు కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది.. భీమారం ఎల్కేశ్వరం , బూరుగుపల్లి, బిట్ ల లో ఈ స్మగ్లింగ్ జరుగుతుండగా… అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు….
భీమారం బీట్ నుండి రవాణా
అత్యధిక శాతం భీమారం బీట్ నుండే కలప అక్రమ రవాణా సాగుతుండగా అధికారులు మాత్రం నామ మాత్రపు దాడులతో పై అధికారుల మెప్పు కోసం దాడులు చేస్తున్నారే తప్ప అసలైన అక్రమ కలప రవాణా చేసే వ్యక్తులను విడిచి పెడుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఏం చేస్తున్నట్లు
వ్యవసాయ రైతులు పొలం చూట్టూ కంచె వేసుకునేందుకు , పెళ్లి లో పాల పొరక తెచ్చుకుంటే , ప్రజలు పొయ్యిల్లోకి కట్టెపుల్లలు తెస్తే , గొల్ల కురుమలు గొర్రెలను మేపేందుకు అడివిలో పశువులను మేపితే , పట్టుకునే అటవి శాఖ అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నట్లు అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు , పేదవారికి ,గొల్ల కుర్మలకు , వ్యవసాయ రైతులను ఇబ్బంది చేసి వారి దగ్గర నుండి పని మొట్లు లాగుకునే అటవీశాఖ అధికారులకు టేకు కట్టెను స్మగ్లింగ్ చేసే వారు కనిపించడం లేదని.. ? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగు తున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి.
భీమారం చుట్టుపక్కల అడవి ప్రాంతం తో పాటు టేకు కలప ఎక్కువగా దొరుకుతుంది. ఇదే అదునుగా భావించిన స్మగ్లర్లు కల్పను స్మగ్లింగ్ చేస్తున్నారు. నామ మాత్రపు దాడులతో అటవీశాఖ అధికారులు గడుపుతున్నారే తప్ప అసలైన కలప స్మగ్లింగ్ చేసే వ్యక్తులను చూసి చూడనట్టు విడిచి పెడుతున్నారని ఆరోపణలున్నాయి.
