- రెండు గంగాలాలు వెళ్లినట్లు ఊర్లో పుకార్లు షికార్లు
- భీమారo మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం
మహా వెలుగు , భీమారo :. మంచిర్యాల జిల్లా భీమారo లో గుప్త నిధుల తవ్వకాల కలకలం రేపుతోంది. ఓ పాత పడ్డ ఇంట్లో గుప్తా నిధుల తవ్వకాలు జరిగినట్లు ఆనవాళ్లు సైతం ఉన్నాయి. గత 10 రోజుల క్రితం ఈ తవ్వకాలు జరిగినట్లు ఆనవాళ్లు సైతం ఉన్నాయి. అందులో భీమారo మండలానికి చెందిన ఓ వ్యక్తి కీలకపాత్ర ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మండల కేంద్రంలోని ఓ పురాతనమైన ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలు జరుపుగా అందులో రెండు గంగాలాలు బయట పడ్డట్లు పుకార్లు షికార్లు అవుతున్నాయి. కాగ ఎస్సి కాలనీకి చెందిన ఇద్దరి యువకులు దీనికి కూలీకి రాగా వారికి ఒక్కరికి రూ.10 వేలు చొప్పున ఇచ్చినట్లు సమాచారం గుప్త నిధుల తవ్వకాల్లో పెద్ద మొత్తం లో చేతులు మారినట్లు తెలుస్తోంది.
