భీమారo లో చిరుతల రామాయణం ప్రారంభం

  • సీతారాముల పట్టాభిషేక
    మహోత్సవం
  • భీమారం లోని స్థానిక పద్మశాలి కాలనీలో చిరుతల రామాయణం సోమవారం నుండి ప్రారంభం

మహా వెలుగు,భీమారo 12 : మంచిర్యాల జిల్లా భీమారo మండల కేంద్రంలోని స్థానిక పద్మ శాలి కాలనీలో చిరుతల రామాయణంను సోమవారం రాత్రి నుండి ప్రారంభించారు. దీనికి ముఖ్యఅతిథిగా పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • సోమవారం – రోజున పుత్ర కామిష్టి యాగం, రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞల జననం
  • మంగళవారం – తాటకి వద అహల్య శాప విముక్తి
  • బుధవారం – శ్రీ సీతారాముల కళ్యాణం పాదుకల పట్టాభిషేకం
    గురువారం – శోకావలి ,జటాయువు మోక్ష పదవి
    శుక్రవారం కిష్కింద కాండ సుగ్రీవ పట్టాభిషేకం ఆంజనేయ లంక ప్రవేశం
    శనివారం – రావణ బ్రహ్మ వద సీతాదేవి అగ్నిప్రవేశం
    ఆదివారం – ఉదయం 8:55 సీతారాముల పట్టాభిషేకం ఉటుందని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ కుమార్ , బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ , కో అప్షన్ సభ్యులు బాబర్ ఖాన్ జిల్లా నాయకులు చేకూర్తి సత్యనారాయణ రెడ్డి , నాయకులు జర్పుల రాజ్ కుమార్ , రాము ,రవి ,లక్ష్మన్ ,ఎల్కేశ్వరం సర్పంచ్ కోడిపే సమ్మయ్య ,గిరిధర్ రెడ్డి , గుడిమల్ల వెంకన్న , వార్డు సభ్యులు గుడిమల్ల నరహరి , వేముల ప్రణీత్ గౌడ్ ,నాయకులు అమర్ సింగ్ నాయక్ , పోటు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.