మహా వెలుగు , భీమారo 01 : చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ల నియామకంను ఆదివారం ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. భీమారం మండల రైతు బంధు సమితి మండల కో – ఆర్డినేటర్ గా భీమారo మండలం ఎల్కేశ్వరం ఏక గ్రీవ గ్రామపంచాయతీకి చెందిన పర్తిరెడ్డి మహేశ్వర్ రెడ్డి ని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి లో గత 2010 నుండి పని చేస్తున్నట్లు వారు తెలిపారు. పదవిని ఇచ్చిన విప్ కి ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ లో కష్టపడి పని చేస్తే గుర్తింపు లభిస్తుందన్నారు. అందుకు తామే నిదర్శనo మని తెలిపారు. ఇక నుండి టిఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తాని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. టిఆర్ఎస్ లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు.
