భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన మంచిర్యాల జిల్లా , కోటపల్లి మండలం ,రొయ్యలపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారులు కుమ్మరి దుర్గవ్వకు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు ,పౌండేషన్ నిర్వాహకులు మార్షల్ , దుర్గం నగేష్ తమ ఫౌండేషన్ సభ్యులతో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం ప్రమీల – నగేష్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతం నుండి భీమ్లా నాయక్ సినిమాలో పాటకు చేయడం సమాజం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ అరుదైన అవకాశం కల్పించిన సినీ హీరో పవన్ కళ్యాణ్ ,సంగీత దర్శకుడు థామస్, కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో భీమ్లా నాయక్ దుర్గవ్వకు సమాజానికి ఉపయోగపడే పాటలు పాడాలని మరిన్ని అవకాశాలు పొంది అత్యున్నత స్థానంలో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాగే భూమయ్య , చందనగిరి ప్రమీల , కుమ్మరి యువరాజ్ , రొయ్యలపల్లి సర్పంచ్ ఓంకార్- రజిత ,వెంకటేష్ , జిమ్ముడి గోపాల్ ,మురళీకృష్ణ సోదారి నారాయణ, రాజబాబు ఓంకార్ – సౌందర్య ,ఇస్తారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.