భూ వివాదం లో యువకుని పై దాడి చేసిన మాజీ సర్పంచ్

మహా వెలుగు భీమారo : భూ వివాదం లో ఓ యువకుని పై మాజీ సర్పంచ్ దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. భాదితుడు దుర్గం లక్ష్మణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…. మంచిర్యాల జిల్లా భీమారo మండలం అరెపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వీరయ్య – దుర్గం కొమురయ్య ,దుర్గం రాజమల్లు లకు అరెపల్లి శివారు ప్రాంతo లో సర్వే నంబర్ 20 ఉండగా గత నెల 25 వ తేదీన గ్రామ పంచాయతీ లో పెద్ద మనుషులు ,అధికారుల ఆధ్వర్యంలో పంచాయితీ నడవగా విఫలం అయింది. దీనితో కక్ష్య కట్టిన మాజీ సర్పంచ్ వీరయ్య ,దుర్గం రాజమల్లు లు కలిసి దుర్గం కొమురయ్య కుమారుడు దుర్గం లక్ష్మన్ పై కర్ర తో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. రాత్రి 100 డైల్ చేయగా పోలీస్ లు వచ్చి సంఘటన స్థలం ను పరిశీలించారని తెలిపారు. మాజీ సర్పంచ్ వీరయ్య తో నాకు ప్రాణ హాని ఉందని బాధితుడు లక్ష్మన్ ఆవేదన వ్యక్తం చేశారు.