- మీడియా కు తెలియకుండా
జాగ్రత్తలు
మహా వెలుగు , నిర్మల్ 15 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు విద్యార్థులు ఎగ్ కర్రీ రైస్ భోజనం చేయగా.. కలుషిత ఆహారం తినడంతో అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.
సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతులు చేసుకున్నవారికి వారి వారి హాస్టల్ రూముల్లోనే ఉంచి మాత్రలు ఇచ్చారు. అస్వస్థకు గురైన వారికి అంబులెన్స్‌తో పాటు ఫ్యాకల్టీ కార్లలో త్రిబుల్ ఐటీలోని ఆసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు.
