మహా వెలుగు , ఖమ్మం 19 తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఓ అపరిచితుడికి లిఫ్ట్ ఇచ్చిన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు
బైకు వెనుక కూర్చున్న వ్యక్తి ఇంజక్షన్ చేయడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ముదిగొండ మండలం బాణాపురంలో జరిగింది. ఆ తరువాత నిందితుడు బైకుతో అక్కడినుంచి పరారయ్యాడని సమాచారం. బైకు కోసం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.
బైక్ పై వెళ్తన్న వెక్తిని లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి బైక్ తీసుకొని పరారైన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండంలో జరిగింది. సంచలన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. తన కూతురును ఏపీలోని గండ్రాయి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.
ఈ క్రమంలో జమాల్ సాహెబ్ తన మోటర్ సైకిల్ పై వల్లబి మీదగా గండ్రాయి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగగా, బైక్ ఆపి అతడికి లిఫ్ట్ ఇచ్చారు. అలా కొద్దిదూరం వెళ్లారో లేదో వెనుకాల కూర్చున్న వ్యక్తి తన బుద్ధి చూపించాడు.
అప్పటికే మంకి క్యాప్ పెట్టుకున్న ఆ గుర్తు తెలియని నిందితుడు బాణాపురం దాటిన తరువాత వల్లబి సమీపంలో ఆ వ్యక్తి వెనక నుంచి సాహెబ్‌కు ఇంజక్షన్ ఇచ్చాడు. దాంతో సాహెబ్ అక్కడిక్కడే చనిపోయాడు. జమాల్ సాహెబ్ చనిపోయాడని నిర్ధారించుకున్న వెంటనే బైక్ పై నిందితుడు పరారైనట్లుగా పలువురు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు పోలీసులకు సమాచారం అందిచారు