సిమెంట్ ఇటుకతో మోది భర్తను చంపిన భార్య

మహా వెలుగు పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 22 : పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి విలేజ్ రామగుండంలో దారుణం చోటుచేసుకుంది.

కల్లెడ మల్లేష్ అనే ట్రాక్టర్ డ్రైవర్ తన భార్య స్వరూపతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య మల్లేష్ తలపై ఇటుకతో కొట్టడంతో రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మరణించాడు. రామగుండం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.