మహా వెలుగు , హైదరాబాద్ బుల్లెట్టు బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీకి చిక్కాడు. తెలంగాణలోని బడంగ్ పేట్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానర్‌గా అశోక్ పని చేస్తున్నాడు. ఓ ఇంటి పర్మిషన్ కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. గతంలో బుల్లెట్టు బండి పాటకు ఓ పెళ్లి ఊరేగింపులో వధువు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో వరుడే ఏసీబీకి పట్టుబడిన టౌన్ ప్లానర్ అశోక్.