బస్సులను ఇతర డిపోలకు తరలించే ప్రయత్నం’

మహా వెలుగు రిపోర్టర్ ప్రసాద్ అనసూరి మంథని నియోజకవర్గం మే 10:

మంథని ఆర్టీసీ బస్సులను ఇతర డిపోలకు తరలించే ప్రయత్నాలను అధికారులు విరమించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ఒక ప్రకటనలోసూచించారు. ఇప్పటికే మూడు బస్సులను ఇక్కడి నుంచి వేరే డిపోలకు పంపించారని, మరో 8 బస్సులను పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. డిపోను కూడా ఎత్తివేసే కుట్ర జరుగుతుందని, దీంతో కార్మికుల ఉనికికే ప్రమాదం
ఏర్పడుతుందన్నారు.