చలో హైదరాబాద్ ను విజయ వంతం చేయండి

మహా వెలుగు, చెన్నూర్ : ఈ నెల 9 యుద్ధభేరి సభ చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని కోరుతూ చెన్నూర్ మండల కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MRPS నాయకులు ,మంత్రి మల్లేష్ మాట్లాడుతూ…. రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్రా కన్వీనర్ మంద కృష్ణ మాదిగ నాయకత్వం లో అద్దంకి దయాకర్ ,జాజుల శ్రీనివాడు గౌడ్, బెల్లయ్య నాయక్ వత్తం ఉపేందర్ , కోదండరాం హరగోపాల్ ,కాసీo, తీగల ప్రదీప్ గౌడ్ , MD రజిహైదర్ పాల్గొంటారని వారు పేర్కొన్నారు.భారత దేశానికి ప్రపంచ దేశాల కెల్లా గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉందని వారు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం నుండి విద్యార్థులు, మేధావులు కార్మికులు, ఎస్సి ,ఎస్టీ ,బిసి మైనార్టీ అగ్రకుల పేదలు ప్రజాస్వామిక వాదులు మహిళలు వికలాంగులు, ఉద్యమకారులు తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తగరం వెంకటి అంబేద్కర్ సంగం ప్రెసిడెంట్ ,చకినారపు మల్లేష్ వేముల రమేష్ , రాపాక మల్లేష్ వొల్లల రాజు ,MSP మండల్ కన్వీనర్ బైన వేణు, MSP చెన్నూర్ పట్టణ కన్వీనర్ తాటికొండ శ్రీనివాస్ , వేల్పుల సతీష్ చెన్నూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.