చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

నంద్యాల : ఈ నెల 22 న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి పనులు రెండు పూటలా పని రద్దు చేయాలని , ఎండాకాలం అలవెన్స్ లో పునరుద్ధరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమo విజయవంతం చేయాలని వారు తెలిపారు. ఉపాధి హామీ లో రెండు పూటల పనిదినాలు రద్దు చేయాలని సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలని టెక్నికల్ అసిస్టెంట్లు ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలని , 30 రోజులు పని చేసే ప్రతి కుటుంబానికి పని మొట్లు ,టెంటు ఇవ్వాలని వారు తెలిపారు . జీతం ఇచ్చేటప్పుడు వడ్డీతో కలిపి ఇవ్వాలని కేంద్ర ప్రాజెక్టులో ఉపాధి హామీ కి రెండు లక్షల కోట్లు నిధులు మంజూరు చేయాలన్నారు. అవి కేటాయించాలని వారు కోరారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధిహామీ ని ప్రవేశ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డి. సద్దాం హుస్సేన్ ,జిల్లా నాయకులు షేక్ హుస్సేన్ , బంగారు తదితరులు పాల్గొన్నారు.