చార్మినార్‌ నిర్మాణానికి 444 ఏళ్లు పూర్తి ..

మహా వెలుగు, హైదరాబాద్ ఆగష్టు 03: శతాబ్ధాల క్రితం నిర్మించిన చారిత్రక కట్టడమే పాతబస్తీలో ఉన్న చార్మినార్ మహానగరానికి ఐకానిక్ సింబల్‌ గా నిలిచిన ఈ చారిత్రక కట్టడం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూలై 31న చార్మినార్‌కు 444 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. హిజ్రీ క్యాలెండర్‌ను ముస్లిం క్యాలెండర్ లేదా ఇస్లామిక్ క్యాలెండర్ అని కూడా పిలుస్తారు. ఈ క్యాలెండ‌ర్ 354 లేదా 355 రోజులతో కూడిన సంవత్సరంలో 12 నెలలతో కూడినక్యాలెండర్. ముహమ్మద్ కులీ కుతుబ్ షా భార్య జ్ఞాప‌కార్ధం నాలుగు స్తంభాలు, క్లిష్టమైన శిల్పాలతో కూడిన ఈ చతురస్రాకార నిర్మాణం నిర్మించబడిందని కూడా చెబుతారు

చార్మినార్‌ లాంటి గొప్ప కట్టడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. స్మారక చిహ్నం నాలుగు స్తంభాలు ఇస్లాం యొక్క మొదటి నలుగురు ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి. 17వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ డి థెవెనోట్ ప్రకారం చార్మినార్ నిర్మించడానికి కారణం పూర్తిగా భిన్నమైనదిగా ఉంది. చార్మినార్ రెండవ ఇస్లామిక్ మిలీనియం ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడిందని పర్షియన్ చెప్పిన క‌థ‌నం ప్ర‌కారం తెలుస్తోంది.

అస‌లు చార్మినార్ చరిత్ర ఇదే!

చార్మినార్ చాలా ప్రత్యేకమైన క‌ట్ట‌డం. హైదరాబాద్‌లోని పాతబస్తీని చార్మినార్ కేంద్రంగా డిజైన్ చేశారు. హైదరాబాద్‌లో మొట్ట‌ మొదటి వంతెన పురానాపుల్‌. ఇది గోల్కొండ, హైదరాబాద్‌లను కలిపేలా నిర్మించారు. ఇక చార్మినార్‌ను 1589లో నిర్మాణం ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేశారు. అందుకు ఖర్చు చేసిన డబ్బు అక్షరాల 9 లక్షలు. అంటే అప్పటి లెక్కల ప్రకారం చెప్పాలంటే 2 లక్షల హన్స్/బంగారు నాణేల‌తో నిర్మించ‌బ‌డింది చార్మినార్ చారిత్రక నిర్మాణం.

చారిత్రక నిర్మాణం వెనుక కథ..

ఇది 30అడుగుల లోతు పునాదితో సుమారు 14,000 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 1670లో చార్మినార్‌లోని నాలుగు స్తంభాలలో ఒక మినార్ పిడుగుపాటుకు గురై కింద పడిపోయింది. అప్పుడు సుమారు కోటి రూపాయలతో మరమ్మతులు చేశారు. చార్మినార్ వాస్తుశిల్పం షియా “తాజియాస్” నుండి ప్రేరణ పొందింది. ఈ తాజియాలు ముహమ్మద్ ప్రవక్త అల్లుడు అంతేకాకుండా కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హుస్సేన్ జ్ఞాపకార్థం దిన్ని నిర్మించార‌ని చెబుతారు.

మొహమ్మద్ కులీ కుతుబ్ షా హయాంలో మొదటి ప్రధానమంత్రి మీర్ మోమిన్ అస్తరాబాదీ చార్మినార్ నిర్మించారు. చార్మినార్ సమీపంలోని సుల్తాన్ షాహీలోని మీర్ మోమిమ్ కా దర్గా దగ్గరున్న స్మశాన వాటికలో ఆయన ఖననం చేయబడ్డారు. చార్మినార్ కట్టడానికి 444 ఏళ్లు పూర్తైన సందర్భంగా డెక్కన్ ఆర్కైవ్ వారం రోజుల పాటు చార్మిన‌ర్ ద‌గ్గ‌ర చార్మినార్ ఫోటోగ్రఫీ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శనలో చార్మినార్‌కు చెందిన అనేక ఫోటోలు, మ్యాప్‌లతో పాటు పెయింటింగ్‌లు ఉంచారు. ఈ ఫోటో ప్రదర్శనను ఆగస్ట్ 8వరకు నిర్వహించనున్నారు నిర్వహుకులు.