చెన్నూర్ నియోజకవర్గ ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం

  • సోమన్ పల్లి వద్ద గోదావరిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడడానికి హెలికాప్టర్ విప్ బాల్క సుమన్

మహా వెలుగు ,చెన్నూర్ 14 : చెన్నూరు నియోజకవర్గ ప్రజలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని , ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.

గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, చెన్నూరు నియోజకవర్గం లోని లోతట్టు గ్రామాల పునరావాస కేంద్రాలు & వసతులు, తీసుకోవలసిన చర్యలపై అధికారులు ప్రజాప్రతినిధులతో చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

భారీ వర్షాలు మరియు ఎగువ నుండి వస్తున్న వరదతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ లపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నమని తెలిపారు. చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడడానికి మంత్రి కేటీఆర్ తో మాట్లాడి హెలికాప్టర్ ను సిద్ధం చేసినట్లు వారు తెలిపారు.

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సింగరేణి రెస్క్యూ సిబ్బందికి ప్రభుత్వం తరుపున ప్రత్యేక ఎక్స్గ్రేషియా ఇప్పించాలని మంత్రి కేటీఆర్ కోరినట్లు వారు తెలిపారు.

ఈ సమావేశంలో ఏసీపీ నరేందర్ ప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.