చెన్నూర్ టిఆర్ఎస్ పార్టీ అడ్డా

చెన్నూరు టిఆర్ఎస్ పార్టీ అడ్డాగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. గత కొంతకాలంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, సర్పంచులు ,ఎంపీటీసీలు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో చేరుతున్నారు. దీనిలో భాగంగానే శనివారం,కోటపల్లి మండలం చెందిన అన్నారం గ్రామ బీజేపీ సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ భాస్కర్, కొండం పేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, దేవులవాడ గ్రామ ఉపసర్పంచ్ సారక్క, పలువురు కాంగ్రెస్ మరియు బీజేపీ కార్యకర్తలకు కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు ప్రభుత్వ విప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన అప్పటినుండి భీమారం ,మందమర్రి, జైపూర్ , కోటపల్లి రామకృష్ణాపూర్ల నుండి అత్యధిక సంఖ్యలో బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.