చీకట్లో జంతువుల కళ్లు ఎందుకు మేరుస్తాయో తెలుసా…..

మహా వెలుగు : చీకటి లో జంతువుల కళ్లు మెరుస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. టీవీలో కూడా అడవిల్లో కనిపించే పులుల కళ్లు చింత నిప్పుల్లా ఎర్రగా లేదా పచ్చని లైట్ గా కనిపిస్తూ ఉంటాయి.

ఇలా మనుషుల కళ్లు ఎందుకు మెరవవు? జంతువుల కళ్లు మాత్రమే ఎందుకు మెరుస్తాయనే సందేహం దాదాపు అందరిలోనూ ఉంటుంది. మరి అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి అన్ని జీవరాశుల కళ్లు కాంతిని ప్రతిబింబిస్తాయి. అయితే కొన్ని జీవరాశుల కళ్లు రాత్రిపూట ఒక లైట్ లాగా వెలిగే టేపెటమ్ లూసిడమ్ అనే ప్రత్యేక ప్రతిబింబ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. టేపెటమ్ లూసిడమ్ అంటే మెరుస్తున్న పొర అని అర్థం. ఈ పొర ఒక అద్దం లాగా పనిచేస్తుంది. ఇది కనుగుడ్డు లోపల రెటీనా వెనుక భాగంలో ఉంటుంది. కాంతిని ప్రతిబింబిస్తూ.. చీకటిలో కూడా బాగా కనిపించేందుకు ఈ పొర జంతువులకు ఉపయోగపడుతుంది.

సాధారణంగా మనుషుల్లోని కనుగుడ్డు లో రెటీనా ఒక్కటే ఉంటుంది. ఒక వస్తువుపై కాంతి పడినప్పుడు ఆ కాంతిని ఈ రెటీనా ఫొటో రిసెప్టార్స్ సాయంతో గుర్తించి ఒక ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు ఆ వస్తువు ఏంటనేది మనకి తెలుస్తుంది. అయితే చీకటిలో కాంతిని రెటీనాలోని ఫొటో రిసెప్టార్స్ గ్రహించలేవు. అప్పుడు చీకటిలో ఉన్న వస్తువులు ఏంటనేది తెలియదు. అయితే జంతువుల్లో మాత్రం రెటీనా వెనకే టేపెటమ్ లూసిడమ్ అనే ఒక మిర్రర్ లాంటి పొర ఉంటుంది. చీకటిలో కనిపించే వస్తువుల నుంచి వచ్చే ఫొటో రిసెప్టార్స్ ని ఈ పొర రిఫ్లెక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ ఫొటో రిసెప్టార్స్ అనేవి తిరిగి రెటీనాకి చేరుకుంటాయి. దీనివల్ల జంతువులకు చీకటిలో ఉన్నవన్నీ మనుషుల కంటే బాగా కనిపిస్తాయి. అయితే ఒక్కోసారి ఈ పొర కనుగుడ్డు బయటికి వెలుగుతూ కనిపిస్తుంది. అలా జంతువుల కళ్లు మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తాయి.

ఒకవేళ ఏదైనా జంతువు కంట్లో రక్తనాళాల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ కళ్లు రెడ్ కలర్‌లో మెరుస్తాయి. కుక్కలు, పిల్లులు, పులులు ఇలా అన్ని జంతువులలో ఈ మెరిసే పొర ఉంటుంది. ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళినప్పుడు జంతువులను సులభంగా గుర్తించేందుకు మనుషులకు ఈ పొర బాగా ఉపయోగపడుతుంది.