వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్.02.మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో సి.ఐ.టి.యు నేత తోట బిక్షం మొదటి సభ సూరణపు సోమయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రసంగిస్తూ తోట బిక్షం యూనియన్ కి ఎనలేని సేవలు అందించారని,కార్మిక శక్తినీ జిల్లా నలుదిశలా నిరూపించారని,యూనియన్ కే కాక పార్టీ కి సామాన్యం పాటినిచారని తెలిపారు.

ఆయన మరణం పార్టీ ఉద్యమానికి,యూనియన్ ఉద్యమానికి తీరని లోటని,తెలిపారు.
మొదట తోట బిక్షం చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి సాదుల శ్రీనివాస్ నివాళులర్పించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు,వివిధ మండలాల నాయకులు,తోట బిక్షం కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు.
