ఏపీలో కేసీఆర్ కు పాలాభిషేకాలు

ఆంధ్రప్రదేశ్ యూత్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేజేలు పలుకుతున్నారు. సీఎం అంటే ఇలా ఉండాలి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.. అంతేకాదు సీఎం జగన్ పై నిప్పులు చెరుగుతున్నాయి.. ఇచ్చిన హామీ మరిచిపోయారా అని నిలదీస్నారు.. ఎందుకో తెలుసా..?

తెలంగాణ సీఎం కేసీఆర్
ఏపీ యూత్ కు హీరోగా మారారు.. ఒకప్పుడు కేసీఆర్ పేరు వింటేనే ఆంధ్రాయువత మండిపడేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. కేసీఆర్ జయహో అనే నినాదాలు చేస్తున్నారు. అక్కడితోనే వారి అభిమానాన్ని ఆపుకోలేదు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో తమకు న్యాయం చేయాలంటూ స్లోగన్స్ చేస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగ యువత విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ నిరుద్యోగ జేఏసీ కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తోంది. తెలంగాణలో 80,039 ఉద్యోగాలుకు నోటిఫికేషన్ విడుదల అయ్యాయి. అలాగే 11,103 కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నందుకు విశాఖలోని పబ్లిక్ లైబ్రరీ దగ్గర కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఏపీ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు. హీరో కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అక్కడితోనే వారు ఆగలేదు.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ యూత్ కు హీరోగా నిలిస్తే.. సీఎం జగన్ జీరోగా నిలిచారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం 2,32,000 ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేసేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మహేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగ దరఖాస్తుకు వయోపరిమితిని 47 యేళ్లకు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సు 60 యేళ్ళకు తగ్గించాలని కోరారు. లేనిపక్షంలో నిరుద్యోగులు నష్టపోతారని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. వియ్ వా౦ట్ జస్టిస్ అ౦టూ నినది౦చారు.

కేవలం ఏపీలోనే కాదు.. ప్రస్తుతం యావత్ భారత దేశంతో యూత్ కు సీఎ కేసీఆర్ హీరోగా మారారు. ఎందుకంటే తెలంగాణలో 91వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న కేసీఆర్‌.. అందరు సీఎం లు ఆదర్శంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని చూసిన తరువాత అయినా.. ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని వారు కోరారు. కేవలం యువత మాత్రమేకాదు.. రాజకీయ నేతలు సైతం సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి సైతం అదే వ్యాఖ్యలు చేశారు. సెంబ్లీ వేదికగా చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు జేసీ. ఈ ప్రకటనతో కచ్చితంగా యువతలో క్రేజ్ వస్తుందన్నారు. ఇంత భారీ సంఖ్యలో ఏ రాష్ట్రం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకూ ఇలాంటి ప్రకటన చేయలేదన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదన్నారు జేసీ దివాకర్ రెడ్డి. సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదన్నారు. అపాయింట్‌మెంట్ ఓకె అయితే కబురు పెడుతామని చెప్పారన్నారు. సీఎంలను కలిసేందుకు ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేదన్నారు. ఏపీలో మంత్రులకే అపాయింట్‌మెంట దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని వదిలేసినట్లే కనిపిస్తోందని.. మంత్రి బొత్స చేసిన ప్రకటన అందుకు ఊతమిచ్చేలా ఉందని అన్నారు.