సీఎం సహాయనిధి చెక్కు అందజేత

  • కురవి జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి

మహావెలుగు కురవి రిపోర్టర్ చల్ల వేణు 17 : మహబూబాద్ జిల్లా కొరివి మండలంలోని కాంపెల్లి గ్రామపంచాయతీ చెందిన భయ్యా నాగేందర్ అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం మరణించారు.

వారి సతీమణి రాములమ్మ పేరు మీదుగా సీఎం సహాయం నిధి నుంచి రూ. 40వేల రూపాయలు రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారి సహాయ సహకారాలతో కొరవి మండల జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి స్వగృహం గుండ్రాతిమడుగులో వారి కుమారుడు భయ్యా శీనుకు చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు డాక్టర్ సుందర్ నాయక్, తెరాస సీనియర్ నాయకులు అర్జున్ చవాన్, నల్లమాస మనోజ్, పున్నయ్య ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు