- ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
మహా వెలుగు , మంచిర్యాల (చెన్నూర్) 03 : కాంగ్రెస్ బీజేపీ నాయకులు గుజరాతీ గులామ్ గాల్లు .. ఢిల్లీ బానిసలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. బిజెపి తెలంగాణకు చేసింది ఏమీ లేదు అని తెలిపారు.
చెన్నూరు మండలం, పొక్కూరు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B.R అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ విప్ గ్రామంలో రూ. రూ. 44 లక్షల తో పలు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో పొక్కూరు గ్రామ అభివృద్ధి కొరకు రూ. 50లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలని పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు తెలిపారు.
గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో ప్రజలకు మరింత సేవలు అందించడమే పల్లె ప్రగతి ఉద్దేశమని తెలిపారు. గత పాలకులు చెన్నూరు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. . త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రూ. 1658 కోట్ల నిధులతో చెన్నూరు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తామన్నారు.
గంగారం బ్రిడ్జ్ (1.97 కోట్లు ), కిష్టంపేట బ్రిడ్జ్ (3.50 కోట్లు), సుబ్బరాంపల్లి బ్రిడ్జ్ (4.80 కోట్లు) పనులు 90% శాతం మేరకు పూర్తయినాయి. 10 కోట్లతో సుద్దాల వాగుపై బ్రిడ్జి పనులు మొదలవుతాయని వారూ తెలిపారు. అన్ని వర్గాలకు అండగా ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భారతి హోళీ కేరి , జడ్పిటిసి మోతే తిరుపతి ,ఎంపిపీ మంత్రి బాపు , టిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.