*కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది*
మహా వెలుగు, ఖైరతాబాద్, ఆగష్టు 05: ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి దూరం కాగా నేడు జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ పార్టీకి రాజీనామా చేశారు. ఖైరతాబాద్ లో విజయ రెడ్డి చేరికతో సీటు రాదన్న భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. ఈయన గత ఎన్నికల్లలో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
