*కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్*

మహా వెలుగు హైదరాబాద్ 05: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు.
కోవిడ్ బారిన పడిన ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు, సోమవారం చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్థారణ అయింది.దీంతో మంగళవారం నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.
ఐదు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, దాంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు.ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించిన విషయం తెలిసిందే.