సి.పి.ఐ(ఎం) నల్లెల్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు.

మహా వెలుగు కురవి/మే1 రిపోర్టర్ చల్ల వేణు

కురవి మండలంలోని సి.పి.ఐ(ఎం) నల్లెల్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో 137 వ మేడే ఉత్సవాలను గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ ఖాజా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ. 137 వ సంవత్సరం క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో 18 గంటల పని దినాలను తగ్గించి, 8 గంటల పని దినాలను అమలు చేయాలని. సమ్మె చేస్తుంటే అక్కడ ఉన్న పెట్టుబడిదారీ వర్గం పోలీసులు కాల్పులు జరిపి 7 గురు మరణించారు. నాటి నుండి 8 గంటల పని అమల్లోకి వచ్చిన రోజు అని వారు గుర్తు చేశారు. కార్మికుల కర్షకుల హక్కులకోసం మే డే ను స్ఫూర్తిగా తీసుకొని పని చేయాలని వారు అన్నారు. భారతదేశాన్ని పరిపాలిస్తున్న బి.జె.పి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తులకు, గుత్త పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మి. నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందని వారు విమర్శించారు. మేడే కార్యక్రమంలో చెన్నబోయిన రాములు, పోతుగంటి జనార్ధనాచారి,రామయ్య, ఓరుగంటి శ్రీనివాస్,ఎల్ది మహేష్, రాయల వినయ్,సయ్యద్ గౌస్, అంజయ్య, బండి సైదమ్మ, అక్కినపల్లి ఉప్పలమ్మ, కోమరే సుశీల, సారక్క తదితరులు పాల్గొన్నారు.