సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే 196 వ జయంతి వేడుకలు…

మహా వెలుగు ప్రతినిధి మహబూబాబాద్ 11 : సిపిఎం పార్టీ మహబూబాబాద్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులర్పించడం జరిగింది…

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు, గునిగంటి రాజన్న , అల్వాల వీరయ్య గార్లు హాజరై మాట్లాడడం జరిగింది…. 1827 వ సంవత్సరంలో మహారాష్ట్రలోని జన్మించి అంటరానితనానికి వ్యతిరేకంగా బ్రాహ్మణ వ్యవస్థ వ్యతిరేకంగా, కుల నిర్మూలన కోసం, పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. .. బ్రాహ్మణిజం, కులవ్యవస్థ, అంటరానితనం, పోవాలంటే చదివే ఏకైక ఆయుధమని భావించి, తన భార్య కు మొదట చదువు నేర్పించి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చేసిన గొప్ప త్యాగశీలి అని అన్నారు. …

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, బానోతు సీతారాం నాయక్, కుర్ర మహేష్, రామ్మూర్తి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు రావుల రాజు, చీపిరి యాకయ్య, హేమ నాయక్, డివైఎఫ్ఐ నాయకులు రజాక్, బానోతు ప్రకాష్ నాయక్ మచ్చ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.