- నిలువు దోపిడీకి సిద్ధమైన దళారులు
మహా వెలుగు ,రామగుండం సెప్టెంబర్ 07:-
డబ్బులిస్తే ఆసరా ఫించను ఇప్పిస్తామనే మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ బంగి అనిల్ కుమార్ , కమిషనర్ బి.సుమన్ రావు ఒక ప్రకటనలో కోరారు. అర్హులైన లబ్దిదారులకు మాత్రమే ఆసరా ఫించను మంజూరవుతుందని వారు తెలిపారు. కొత్తగా మంజూరైన ఆసరా ఫించన్ల సొమ్ము నగదు రూపంలో చెల్లించడం కాకుండా ఆయా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ అవుతుందని వారు తెలిపారు. కావున ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా వుండాలని వారు సూచించారు.మధ్యవర్తులకు డబ్బులు చెల్లిస్తే నగర పాలక సంస్థ భాద్యత వహించదని తెలిపారు.