డప్పులు కొట్టిన చేతులు, చెప్పులు కుట్టిన దళితులు దళిత బంధు తో ఎదుటి వారికి అప్పులు ఇచ్చే స్థాయికి వస్తారు.

  • ప్రభుత్వ విప్ చెన్నూర్ , ఎమ్మెల్యే బాల్క సుమన్
  • జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మహా వెలుగు , మంచిర్యాల 22 : డప్పులు కొట్టిన చేతులు, చెప్పులు కుట్టిన దళితులు దళిత బంధు తో ఎదుటి వారికి అప్పులు ఇచ్చే స్థాయికి వస్తారని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.

ఆసరా పెన్షన్ లు, దళిత బంధు, పోడు భూములకు సంబంధించి నస్పూర్, CC గెస్ట్ హౌస్ యందు నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కలిసి ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పలు గ్రామాల్లో మిగిలి ఉన్న FRC కమిటీలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్, R&B, NH 63 రోడ్లకు సంబంధించిన అటవీ అనుమతులు, ఇతరత్రా ఇబ్బందులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

2014 ముందు వరకు అటవీ భూములను సాగు చేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకూడదని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్లాంటేషన్ దెబ్బతినకుండా మరియు అటవీ సంబంధిత అంశాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని , రైతు భూములకు సంబంధించి నెలకొన్న సమస్యలపై రెవిన్యూ , ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని స్పష్టం చేశారు.

మారుమూల గ్రామాల్లో అంత్యక్రియల సమయంలో, స్థానిక పనులకు మట్టి, పశుగ్రాసం కోసం అడవులకు వెళ్లే రైతులను మానవత్వంతో చూడాలని

అటవీ అధికారులు ప్రజలకు అనుకూలతగా.. కోరుకునేలా పనిచేయాలని కోరారు.కొన్ని అంశాల్లో అటవీ చట్టాలకు సంబంధించి ఉన్న కఠిన నిబంధనలు సవరించాల్సిన అవసరం ఎంత అయిన ఉందని వారు తెలిపారు.

దళిత జాతికి ఆర్థిక, సామాజిక మద్దతు అందిస్తూ..
దళిత జాతి స్వశక్తితో, ఆత్మగౌరవంతో జీవించాలనే మహా సంకల్పంతో దళిత బంధు పథకం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారని , చెన్నూరు నియోజకవర్గంలో కొత్తగా 6365 మందికి ఆసరా పెన్షన్ లు అందిస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్ , ఎమ్మెల్సీ దండే విఠల్ కలెక్టర్ భారతి హొళ్లికేరి అడిషనల్ కలెక్టర్, డీసీపీ,అఖిల్ మహాజన్ FDO, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గున్నారు.