మహా వెలుగు, పెద్దపల్లి 08 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దళిత హక్కుల వ్యతిరేక విధానాలపై పోరాటాలే శరణ్యమని, దళిత హక్కుల పోరాట సమితి ఇచ్చే పోరాటాల్లో, ఉద్యమాల్లో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని పాలకులకు మన శక్తి ని చూపెట్టాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కందుకూరి రాజారత్నం పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ మజ్రూం భవన్లో జరిగిన తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా లో చేసిన పోరాట కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమావేశంలో నేషనల్ దళిత రైట్ అధ్యక్షులు రామ్మూర్తి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారని, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు యేసు రత్నం కార్యదర్శి శ్రావణ్ కుమార్ మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి , బాల నరసింహ, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లి నరసింహలు, నాయకులు తాళ్ళపల్లి లక్ష్మణ్ ,
ఎర్రల రాజయ్య, ఆకునూరి శంకరయ్య, ఏ. రవీందర్, చిలుముల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
