మహా వెలుగు ,హైదరాబాద్ దళిత జాతి అభ్యున్నతి కోసం ఒక సువర్ణ అధ్యాయాన్ని కేసీఆర్ లిఖించారని
,దేశంలో అత్యంత వెనుకబడిన జాతి దళిత జాతి అని ఎమ్మెల్యే బాల్కసుమన్ తెలిపారు.
హైదరాబాద్ హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్న టిఆర్ఎస్ ప్లీనరీ వేదికలో విప్ బాల్కసుమన్ మాట్లాడుతూ.. గబ్బిలం కావ్యంలో గుర్రం జాషువా చెప్పినట్లు.. భారతావని దళితజాతికి బాకీ పడిందని. అది పూర్తి స్తాయిలో గుర్తించిన మహానుభావుడు కేసీఆర్ అని, దళితబంధు పథకం దళిత జాతి కోసం ఎన్నో తీసుకొచ్చారన్నారు.

కేసీఆర్ కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనపుడే సిద్దిపేటలోని దళితుల అభ్యున్నతి కోసం ‘దళిత చైతన్య జ్యోతి’ అనే కార్యక్రమాన్ని అమలు చేశారని, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ పదవిని దానయ్య అనే దళితుడికి ఇచ్చి ఉమ్మడి ఎపి రాజకీయాల్లో విప్లవం సృష్టించారని ఈసందర్భంగా గుర్తుచేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు
