ప్రపంచంలోనే ఇది మొదటి సారి

  • దళిత జాతీ గర్వించే విధంగా దళిత బంధు పతకం విప్ బాల్క సుమన్

దళిత జాతి గర్వించే విధంగా ‘దళిత బంధు ఉందని’ ప్రపంచంలోనే మొదటి సారిగా దళితుల కోసం ఈ దళిత బంధును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ విప్ ,చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.
చెన్నూర్ నియోజకవర్గం, క్యాతనపల్లి మున్సిపాలిటీ, MNR గార్డెన్స్లో చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన 100 మంది దళితబంధు పథకం లబ్ధిదారులకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొలీ కెరీతో కలిసి అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్దిదారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ..అనగారిన వర్గాలకు ఆర్ధిక తోడ్పాటును అందిస్తూ, కుల వివక్షను రూపుమాపుతూ,దళిత జాతికి ఆర్థిక, సామాజిక మద్దతు అందిస్తూ ,దళిత జాతి స్వశక్తితో, ఆత్మగౌరవంతో జీవించాలనే మహా సంకల్పంతో..“తెలంగాణకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన” ఘనత కేసీఆర్ కు దక్కుతుందని వారు తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన లో కేసీఆర్ దళిత సమాజం తరపున, మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో బ్రతుకు కోసం, స్వేచ్ఛ కోసం, కూలి కోసం, మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడే జాతి ఏదైనా ఉంది అంటే అది ఒక దళిత జాతేనని ,
నాటికీ నేటికీ దళిత సమాజం అణచి వేయబడ్డతున్న ఈ సందర్భంలో దళిత జాతిలో ఒక చైతన్యం నింపుతూ ,వారి జీవితాల్లో బ్రతుకు సమరాన్ని నింపుతూ, యావత్ దళిత జాతిని కదిలించి నడిపించగల నాయకత్వం కోసం ,దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో, దళిత జాతి అభ్యున్నతి కోసం అభినవ అంబేద్కరుడై మన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి ఏకంగా దళిత జాతి అస్తిత్వానికే తిరిగి ప్రాణం పోశారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు వెలుగులో ఊపిరి పోసుకున్న దళిత బంధు పథకం ద్వారా వారి జీవితాల్లో నేడు ప్రగతి వెలుగులు ప్రసరించనున్నాయన్నారు. సమానత్వ సాధన కోసం
కులరహిత సమాజం కోసం ,పరితపిస్తున్న దళిత సమాజం కోసం ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించి, అనేక పర్యాయాలు చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత చైతన్యానికి మార్గదర్శిగా నిలుస్తూ నేడు రాష్ట్రంలో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారు. దశలవారీగా రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందిస్తూ రూ.10 లక్షల అందించడం జరుగుతుందని అంతే కాక దేశంలో ఒక్క పథకం కోసం రూ.1.70 లక్షల కోట్లు వెచ్చించడం ఇదే తొలిసారన్నారు. ప్రభుత్వ లబ్ధిదారుని భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన “దళిత రక్షణ నిధిని” ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ,దళిత బంధు లబ్దిదారులు పాల్గొన్నారు.