దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి : నర్సా గౌడ్

మహా వెలుగు రామగుండం ఏప్రిల్ 17 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బెందె నాగభూషణం గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అమర వేణి నర్సాగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, గీతా కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నర్సా గౌడ్ అన్నారు అలాగే గౌడ్ లకు దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని హైదరాబాదులో బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మడ్డి ఎల్లా గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగభూషణం గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు మూల అశోక్ గౌడ్, రాష్ట్ర నాయకులు బాలసాని స్వామి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రవి గౌడ్, మడగొని. రవి, సిరిసెట్టి తిరుపతి గౌడ్, కెక్కర్ల సతీష్ గౌడ్, శ్రీను, గోపాగొని నవీన్, రానాపుర్ గౌడ కులస్తులు, పడాల రమేశ్ గౌడ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.