మహా వెలుగు రామగుండము 29: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలిస్తే చూస్తూ ఊరుకోమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు డిగ్రీ కళాశాలను తరలిస్తే రాకపోకలకు ఇబ్బంది కలిగి ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని ఆయన అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారు 1000మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, వారిని వదిలి పెట్టి మెడికల్ కళాశాలలోని 150మంది విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలిస్తాననడం సిగ్గుచేటని ఆయన అన్నారు. డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా దూరం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారని, సంబంధిత అధికారులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పసుల సాయి, కొమ్ము వంశీ, మొలుగురి నిహాల్ తదితరులు పాల్గొన్నారు.
