– దేశ రాజధాని ఢిల్లీలో రేపే తెలంగాణ రైతు దీక్ష
– పాల్గొననున్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
మహా వెలుగు, చెన్నూర్ : దేశ రాజధాని ఢిల్లీలో మనవాళ్లు రేపు దీక్షను చేయనున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ భవన్లో లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. చెన్నూరు, కోటపల్లి, జైపూరు, మందమరి, రామకృష్ణాపూర్, మండలాల నుండి శనివారం అధిక సంఖ్యలో ఢిల్లీకి తరలి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం మెడలు మంచి ధాన్యం కొనసాగించేందుకు గులాబి దండు హస్తినకు కదిలింది. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించనున్న దీక్షకు మన వాళ్ళు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో హాజరుకానున్నారు.
ఎక్కడ చూసినా టిఆర్ఎస్ దీక్ష పైన చర్చ
ఢిల్లీలో లో ఎక్కడ చూసినా దీక్ష పైన చర్చ కనిపిస్తుంది. ఢిల్లీ ప్రధాన కూడళ్ళలో దీక్ష కు సంబంధించిన పెద్ద ఎత్తున పోస్టర్లు ఫ్లెక్సీలు వెలిశాయి. హిందీ ఇంగ్లీష్ భాషలలో టిఆర్ఎస్ డిమాండ్లు ఒక దేశం ఓకే దాన్యం సేకరణ విధానం తో బారి హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.
కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదు : ప్రభుత్వ విప్ బాల్క సుమన్
తెలంగాణ నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని టిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ధాన్యాన్ని సేకరించే దాకా కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులను ఎలా కాపాడుకోవా లో ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు కు తెలుసని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్న కేంద్ర మంత్రి గోయల్ కు నూకల చెల్లిస్తామని వారు హెచ్చరించారు.
