స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

-జిల్లా కలెక్టర్ కె.శశాంక్

వి. కపిల్ కుమార్, మహా వెలుగు ,మహబూబాబాద్, ఏప్రిల్ -30: జిల్లాలో ఖాళీగా ఉన్న సెకండ్ క్లాస్ స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఒక పోస్టుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రిన్సిపల్ కోర్టు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిందని జిల్లా కలెక్టర్ కె.శశాంక శనివారం ఒక్క ప్రకటనలో తెలిపారు.

హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ లో గానీ, రాష్ట్ర జుడిషియల్ సర్వీస్ లో సేవలందించి పదవి విరమణ, రాజీనామా చేసిన వారు, న్యాయ మంత్రిత్వ శాఖలో సూపర్డెంట్ స్థాయిలో సేవలందించి న్యాయ పట్టా కలిగినవారు, హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ గా సేవలందించిన న్యాయ పట్టా కలిగినవారు, కనీసం ఐదు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ప్రస్తుతం ప్రాక్టీస్ చేయని 45 సంవత్సరాలు పైబడిన అడ్వకేట్, పదవి విరమణ పొందిన అధికారి న్యాయ పట్టా ఉండి తన సర్వీస్ లో కనీసం మూడు సంవత్సరాలు మెజిస్టీరియల్ పవర్స్ వినియోగించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన క్రిమినల్ జుడిషియల్ పరీక్ష ఉత్తీర్ణులైనవారు, 2022 జూలై ఒకటి నాటికి 65 సంవత్సరాలు పూర్తి చేయడానికి కనీసం ఒక సంవత్సరం ఉన్న వారు అర్హులని కలెక్టర్ పేర్కొన్నారు.

అర్హులైన అభ్యర్థులు వారి పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం, న్యాయ పట్టా, విద్యార్హత సర్టిఫికెట్లు, బార్ అసోసియేషన్ లో ప్రాక్టీస్ చేయడం లేదని సర్టిఫికెట్, పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి ప్రొసీడింగ్స్, డిపార్ట్మెంటల్ పరీక్ష ఉత్తీర్ణులైన సర్టిఫికెట్ రెండు సెట్లు జతచేసి మే-7 సాయంత్రం 5 గంటల లోగా ఉమ్మడి వరంగల్ జిల్లా లోని ప్రిన్సిపల్ కోర్టులో దరఖాస్తు సమర్పించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.