- ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
మహావెలుగు కురవి మే30 రిపోర్టర్ చల్ల వేణు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని తటుపల్లి గ్రామా నివాసి టీవీ 9 ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ,సీనియర్ జర్నలిస్ట్ డీ వై గిరి,రాజేష్ తల్లి దొంతు చుక్కమ్మ పరమపదించగా డోర్నకల్ శాసన సభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ వారి స్వగృహం వెళ్లి దొంతు చుక్కమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనో ధైర్యం చెప్పారు. వీరి వెంట జిల్లా నాయకులు పిచ్చి రెడ్డి, జిల్లా టిఆర్ఎస్వి నాయకులు గుగులోతు రవి నాయక్, దొడ్డ గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.