అడుగు అడుగున అభివృద్ధి జరుగుతుంది

మహా వెలుగు,డోర్నకల్ 24 : డోర్నకల్ మండలంలో అడుగుఅడుగున అభివృద్ధి జరుగుతుందని ఎంపీపీ డిఎస్ బాలు నాయక్ ,జెడ్పిటిసి పొడి శెట్టి కమల రామనాధం , కురివి ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముండ్ల రమేష్, కురవి మండల అధ్యక్షుడు తోట లాలయ్య పేర్కొన్నారు. తెల్లబండతండా గ్రామం నుండి ఉప్పరగూడెం గ్రామం వరకు దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరం గల లింక్ రోడ్డును డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సహకారంతో రూ.2 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు. ఈ రోడ్డు తో దూర భారం తగ్గడం తో పాటు ప్రజలకి సౌకర్య వంతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లబండతండ గ్రామసర్పంచ్ శ్రీను నాయక్, చిలుకోడు సర్పంచ్ రాయల వెంకటబాబు , ఉప్పరగూడెం సర్పంచ్ కాలం తిరుపతిరెడ్డి ,డోర్నకల్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకటేశ్వరరావు ,చిలుకొడు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాయల నరేష్ ,గ్రామ పార్టీ అధ్యక్షులు కడెం బాబు ,తెళ్లబండతండా యూత్ అధ్యక్షులు జి. నరేష్ సిరోల్ ఎంపీటీసీ బొజ్యా నాయక్ ఉప్పరగూడెం రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ శ్రీను , కురవి ఉప సర్పంచ్ జర్పుల వెంకన్న మాకుల్ ఉపేందర్, ధరమ్ సోత్ రమేష్ మల్చుర్ డోర్నకల్ మండలాల పలువురు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు యువకులు, వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ గ్రామాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు పనులను విజయవంతం చేశారు.