దుర్మార్గపు, దరిద్రపు, చేతకాని, అసమర్థ ప్రభుత్వం ప్రధాని మోడీది

  • ఈ నిర్ణయంపై ప్రజలు, మేధావులు, సబ్బండ వర్గాలు స్పందించాలిసిన అవసరం ఉంది
  • బండి సంజయ్ , కిషన్ రెడ్డి కి సిగ్గు ఉండాలి
  • ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫైర్

మహా వెలుగు ,మంచిర్యాల 17 : కేంద్రo మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్ని పత్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దుర్మార్గపు, దరిద్రపు, చేతకాని, అసమర్థ ప్రభుత్వం ప్రధాని మోడీది అని ఒకప్పుడు జై జవాన్ జై కిసాన్ అనే వారు..మోడీ ప్రభుత్వం నై జవాన్ నై కిసాన్ నినాదంతో పనిచేస్తుందని , అగ్నిపత్ నిర్ణయంతో దేశ యువత గొంతు నొక్కాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుందని ఈ నిర్ణయంపై ప్రజలు, మేధావులు, సబ్బండ వర్గాలు స్పందించాలిసిన అవసరం ఉందని అన్నారు.

శుక్రవారం సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని, రైల్వే వ్యవస్థ కేంద్రం ఆధీనంలో ఉన్న విషయం తెలిసి కూడా సిగ్గు లేకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ ఘటనగా చిత్రీకరిస్తున్నారు.

వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించు కోవాలని గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతీయకుండా, దేశ రక్షణకు పాటుపడాలని దుర్మార్గపు, దరిద్రపు, చేతకాని, అసమర్థ ప్రభుత్వం ప్రధాని మోడీ ప్రభుత్వం మని ఎద్దేవాచేశారు.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చేది లేదు చచ్చేది లేదు, 16 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊసేలేదు. కేంద్రం తెలంగాణ కు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క తేల్చాలని ,మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు దేశ భద్రతకు పెను ముప్పుగా దాపరిస్తున్నాయన్నారు.

ప్రధాని అదాని సంపాదన పెంచడానికే పని చేస్తున్నారు. నిత్యం అదాని సేవలో తరిస్తు ఆధాని జపం చేస్తున్నారని

సికింద్రాబాద్ ఘటనపై పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వం వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ బీజేపీని గద్దె దించడానికి యువత నడుం బిగించాలన్నారు.