హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. ఊసరవెల్లి ఫోటో షేర్ చేస్తూ ట్విట్టర్ వేదికగా రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై నెటిజన్లు సైతం పెద్ద మొత్తంలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. కాగా.. రేవంత్ మరో ట్వీట్లో ‘కేసీఆర్ తన నీడకు కూడా భయపడుతున్నారు. సీఎం పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వీలుగా వరుసగా రెండో రోజు పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఒకపక్క నిరుద్యోగ యువత ప్రాణాలు విడుస్తుంటే…ఇది సంబరాలు చేసుకునే సమయమా…?!’’ అంటూ మండిపడ్డారు.