బైకును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్

మహా వెలుగు ఖమ్మం : జిల్లాలోని తల్లాడ మండలం రెడ్డిగూడెం దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైకును ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో బైకిస్ట్‌ చౌడ కృష్టకుమారి (48) మృతి చెందారు. చౌడ కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.