కనికరపు అశోక్
తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి డిమాండ్
భీమారం తహశీల్దార్ వరకు ర్యాలీ,ధర్నా DT గార్కి వినతి పత్రం
మద్దతు తెలిపిన
సంకే రవి జిల్లా అధ్యక్షులు
రైతు సంఘం.
– బొడేంకి చందు జిల్లా కన్వీనర్ వృత్తిదారుల సమన్వయ కమిటీ
బీమరం మండలంలోని వివిధ గ్రామాల పేదలు ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తమకు సాగు భూములు,డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇవ్వాలని ర్యాలీ, భీమరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు సాగుభూములు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు,ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు. హామీలను అమలు చేయాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల ప్రభుత్వాలకు పేదల అభివృద్ధిపై ఎంత శ్రద్ధ ఉందో అర్థం అవుతుంది.
దళితులకు,పేదలకుమూడు ఎకరాలు గిరిజనులకు 10 ఎకరాలు ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అని చెప్పిన ముఖ్యమంత్రి గారే నేటికీ అమలు జరపకపోవడం శోచనీయ.
ఈ కార్యక్రమంలో జక్కులమారి మరయ్య వ్య కా స జిల్లా ఉపాధ్యక్షుడు, భీమరం మండల నాయకులు బాపులాల్,హరిలాల్,దాశ్రునాయక్, తైనేని రవి,భాస్కర్,శంకర్, ఎసుకుమర్,తిరుపతి,శశికుమార్,లచ్చునాయక్,దేవేందర్,తదితరులు పాల్గొన్నారు.