గల్వన్ లో చనిపోయిన సైనిక కుటుంబాలకు కేసీఆర్ ఆర్ధిక సాయం

గల్వన్ వ్యాలీలో చనిపోయిన సైనికులకు ఆర్థికసాయం అందిస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వారి స్వరాష్ట్రం ఝార్ఖండ్ కు వెళ్లి చెక్ అందజేశారు.అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి 10 లక్షల చెక్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అందజేశారు. మరో వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు కూా సీఎం కేసీఆర్ 10 లక్షల చెక్ ను అందజేశారు.