ఇదే తరహా లో నేరానికి పాల్పడిన వారి పై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం..

  • మహా వెలుగు రామగుండం రిపోర్టర్ చందా సాగారిక

ఇదే తరహాలో నేరానికి పాల్పడిన వారి పై పీడీ యాక్ట్ లు నమోదు చేస్తామని ,ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఏసీపీ గిరి ప్రసాద్ తెలిపారు. మంగళవారం RFCL ప్రాంతంలో లారీలు పార్క్ వద్ద గంజాయి పట్టుబడగా వాటి వివరాలను బుధవారం వెల్లడిoచారు. ఏసీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతల లక్ష్మినారాయణ, ntpc ఎస్ఐ శ్రీ N. స్వరూప్ రాజ్ , SI-2 కే. కుమార్ , సిబ్బంది N.మల్లికార్జున, అంజయ్య అజయ్ లతో యుక్తంగా నమ్మదగిన సమాచారం మేరకు RFCL ప్రాంతంలో లారీలు పార్క్ చేసే దారిలో ఉన్న రేకుల షెడ్ వద్ద బీహార్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు 1)దీపక్ కుమార్ వృత్తి :లేబర్,2) హీరాలల్ యాదవ్ వృత్తి -లేబర్ అనువార్లు అనుమానస్పదంగా కనిపించగా వారి దగ్గరికి వెళ్లి తనిఖీ చేయగా వారి దగ్గర చెరొక కవర్లో గంజాయి అందజా 300 గ్రాములు , మొత్తం 600 గ్రాములు దొరకగా వెంటనే వారిని అదుపులోకి తీసుకోనీ వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు
ఇక పై ఎవరైనా గంజాయి తాగిన, విక్రయించిన వారి పై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు.