ఈ నెల 16వరకు మాత్రమే గడువు


మహా వెలుగు రామగుండం ఏప్రిల్ 12:
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నారాయణ రావు మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8 నుండి ప్రదర్శిస్తున్న 23వ డివిజన్ ముసాయిదా ఓటరు జాబితాకు సంబందించి అభ్యంతరాలు సమర్పించడానికి ఈ నెల 16వరకు మాత్రమే గడువుందని తెలిపారు. ఈ నెల 16వరకు స్వీకరించిన అభ్యంతరాలను ఈ నెల 19వ తేదీలోగా పరిష్కరించి తుది ఓటరు జాబితా 21న ప్రచురించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రామగుండం నగర పాలక సంస్థ సెక్రెటరీ రాములు , ఎసిపి మాతంగి శ్రీనివాస్, రెవెన్యూ ఆఫీసర్ మనోహర్, టిపిఎస్ సతీష్ తో పాటు వివిధ పార్టీల ప్రతినిధులు అచ్చే వేణు (టిఆర్ఎస్), బొంతల రాజేష్ (ఐఎన్ సి), జి నవీన్ గౌడ్, సమ్మయ్య యాదవ్, రామన్న (బిజెపి), మద్దెల దినేష్ ( సిపిఐ), జింక ఉదయ్ (బిఎస్పి ), మీర్ జాకీర్ అలీ, ఎస్ కె హాజీ అలీ (ఎఐఎంఐఎం), నిమ్మకాయల ఏడుకొండలు (తెలుగుదేశం )తదితరులు హాజరయ్యారు.