Breaking news //ఏజేన్సీలో గంజాయి విక్రయాలు. గుప్పు మంటున్నాయి..?

  • గంజాయి విక్రయిస్థున్న వారిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం..?
  • వీరిని కాపేడేందుకు రాజకీయ నాయకులకు, అధికారులకు పెద్ధ ఎత్తున పైరవీలు.

వి. కపిల్ కుమార్,మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్, మహబూబాబాద్.09 :మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని రామచంద్రాపురం,జగత్ రావు పేట పంచాయితి రెడ్యాతండ గ్రామంలో కొంతమంది భధ్రాచలం , చత్తీసుగడ్ రాష్ట్రం లో ఏజెన్సీలో నుండి తక్కువ ధరకు గంజాయినీ గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలు చేసి మండలంలో కొంత మంది యువకులకు అధిక రేట్లకు గంజాయి అమ్మకాలు సాగించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఇద్దరు వ్యక్తులను..? అదుపులోకి తీసుకొని వారి వద్ధ నుండి రెండు నుండి మూడు కేజీలు సంఘటన స్థలంలో స్వాధీన పర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం

స్థానికుల సమాచారం ప్రకారం సోమవారం బయ్యారం బస్టాండ్ సెంటర్ సమీపంలో మండలంలోని రెడ్యాతండ కు చెందిన మామ,అల్లుడు టు వీలరు వాహనంపై గంజాయి తీసుక వచ్చి కొంత మంది యువకులకు గత కొంత కాలంగా గంజాయి విక్రయించినట్లు సమాచారం..? దీనితో మండలంలో తమకున్న పలుకు బడితో బడా నాయకులు గంజాయి విక్రయాలు సాగిస్థున్నట్లుగా, ఒక వేళ అధికారులు పట్టుకున్నా వీరిని కాపేడేందుకు రాజకీయ నాయకులకు, అధికారులకు పెద్ధ ఎత్తున పైరవీలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.