మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 08 : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ సమీపంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి పంప్ హౌస్ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులుగా రెండు పంపు మోటార్ల ద్వారా 5,220 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి లోకి ఎత్తి పోస్తున్నారు. గత నెలలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు, మల్లన్న సాగర్ జలాశయాలకు నీటిని పోయడం తో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి శాతం తగ్గింది.
