ఇందారం లో అడుగు అడుగున అభివృద్ధి

మహా వెలుగు జైపూర్ 22 : జైపూర్ మండలం ఇందారం గ్రామంలో అడుగు అడుగున అభివృద్ధి జరుగుతుందని మునుపు ఎన్నడూ లేని విధంగా సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఇందారం గ్రామ సర్పంచ్ గడ్డం మంజుల – ప్రసాద్ గౌడ్, జైపూర్ మండల్ వైస్ ఎంపిపి పెద్దపల్లి రమేష్, ఎంపిటిసి అరికే స్వర్ణ సంతోష్ యాదవ్ తెలిపారు. మంగళవారం సిసి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన వారు మాట్లాడారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే సుమన్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు చిప్పకుర్తి వెంకన్న, వార్డు సభ్యులు వైద్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.