మహా వెలుగు న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకి అధికమవుతున్న క్రియాశీల కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని అధికారులు తెలిపారు.
సోమవారం తాజాగా 8 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 8,084 కేసులు రాగా, పాజిటివిటీ మూడు శాతం దాటి 3.24 శాతంగా నమోదైనట్లు తెలిపింది. ఆదివారం పాజిటివిటీ రేటు 2.71 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోయింది.
మొత్తం కేసుల సంఖ్య 4.32 కోట్లకు చేరగా, 4.26 కోట్ల మందికి పైగా వైరస్ నుండి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 10 మంది మరణించారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ నుండి అధికంగా కేసులు వస్తున్నాయి. సుమారు ఆరు వేల కేసులు ఈ రాష్ట్రాల నుండే వచ్చాయి.