- చెన్నూరు ఎత్తిపోతల పథకానికి పాలనాపరమైన అనుమతులు
- GO – 133 మంజూరు చేస్తూ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- చెన్నూర్ రైతులు, ప్రజల తరఫున ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన విప్ సుమన్
- సాకారం కానున్న చెన్నూరు నియోజకవర్గ రైతుల చిరకాల స్వప్నం
మహా వెలుగు ,హైదరాబాద్ 23 : తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 10 TMCల నీటిని వినియోగిస్తూ 1658 కోట్ల వ్యయంతో చెన్నూరు నియోజక వర్గంలోని 90 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే “చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి” పాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ జీవో – 133 ను శనివారం విడుదల చేయగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెన్నూర్ రైతాంగం తరపున, ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం లోని లిఫ్ట్ – 1 లో భాగంగా పార్వతి బ్యారేజ్ నుండి జైపూర్ మండలం లోని 21 గ్రామాలు, మందమర్రి మండలం లోని 6 గ్రామాలు మొత్తంగా 27 గ్రామాల పరిధిలోని 25422 ఎకరాలకు సాగు నీరు అందనుందని తెలిపారు.

లిఫ్ట్ -2 లో భాగంగా సరస్వతీ బ్యారేజ్ నుండి చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద నిర్మించే పంప్ హౌస్ నుండి చెన్నూరు మండలం లోని 30 గ్రామాలు, భీమారం మండలం లోని 13 గ్రామాలు, కోటపల్లి మండలంలోని 9 గ్రామాలు మొత్తంగా 52 గ్రామాల్లోని 48208 ఎకరాలకు సాగు నీరు అందనుందని
లిఫ్ట్ – 3 లో భాగంగా లక్ష్మి బ్యారేజ్ నుండి కోటపల్లి మండలం ఆల్గo వద్ద నిర్మించనున్న పంప్ హౌస్ ద్వార కోటపల్లి మండలం లోని 24 గ్రామాల్లోని 16,370 ఎకరాలకు సాగు నీరు అందనుందని
మొత్తంగా 1658 కోట్ల రూపాయలతో నిర్మించే చెన్నూర్ ఎత్తిపోతల పథకం ద్వారా 74270 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు మరియు 15730 వేల ఆయకట్టు స్థిరీకరించబడి మొత్తంగా చెన్నూరు నియోజకవర్గం లోని 103 గ్రామాల్లో 90 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.

