ఘనంగా ఆంద్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద జయంతి వేడుకలు

మహా మహాదేవపూర్ : ఘనంగా ఆంద్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద జయంతి వేడుకలు మండలంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరిపారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటరాజబాపు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా ,విగ్రహానికి పూలమలతో అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ సభ్యులు ఆకుతోట సుధాకర్ ఆధ్వర్యంలో పండ్ల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి గూడల అరుణ – శ్రీనివాస్ ,యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రవెల్లి విలాస్ రావ్ ,ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు లేతకరి రాజబాపు తదితరులు పాల్గొన్నారు.