*అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు*
*
*నాలుగు కిలోల గంజాయి , సెల్ ఫోన్*
మహా వెలుగు, మంచిర్యాల్, ఆగష్టు 04: గంజాయి రవాణా చేస్తున్న యువతిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సీఐ ఆకుల అశోక్, ఎస్సై ఆది మధుసూదన్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించార మంచిర్యాల బస్టాండ్ లో ఓ యువతి అనుమానస్పదంగా కనిపించడంతో ఆమె వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. అందులో సుమారు నాలుగు కిలోల గంజాయి దొరికింది. బల్లర్షకు చెందిన పూజ ఆకాష్ అనే ఆ మహిళ ను అదుపులోనికి తీసుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ లో ఓ వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి మంచిర్యాలలో అమ్మేందుకు తీసుకువచ్చింది. ఆమె దగ్గర దొరికిన గంజాయి, నిందితురాలని మంచిర్యాల పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. దాడుల్లో పోలీసులు శేఖర్ ,తిరుపతి పాల్గొన్నారు.
